కృష్ణా జిల్లా కంచికచర్లలో గుట్కాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గుట్కా కింగ్ దాసా శేఖర్ గోడౌన్లో టాస్క్‌ఫోర్స్ దాడులు చేసి.. సుమారు 2లక్షల రూపాయలకు పైగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు శాఖల అధికారుల తనిఖీల్లో దాసా శేఖర్ పట్టుబడ్డాడని అధికారులు తెలిపారు. ఎన్నిసార్లు పట్టుబడినప్పటికి అంతకంతకు వ్యాపారం పెంచుకుంటూ అక్రమ గుట్కా వ్యాపార సామ్రాజ్యం విస్తరింపజేస్తున్నాడని అన్నారు. శేఖర్ ఇతర గోడౌన్ లపై కూడా దాడులు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి. డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు... పోలీస్ శాఖ ప్రత్యేక వీడియో