అంగలూరులో ఉపరాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్ పర్యటన - latest news on swarna bharathi trust
విద్యార్థుల్లో నైపుణ్యత పెంచేందుకే స్వర్ణ భారతి ట్రస్ట్ ఏర్పాటు చేశామని ఉపరాష్ట్రపతి కుమార్తె, ఆ సంస్థ ట్రస్టీ దీపా వెంకట్ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో ఆమె పర్యటించారు. తొలుత బాలికల వసతి గృహాన్ని సందర్శించిన దీపా వెంకట్ అనంతరం డైట్ కళాశాలను పరిశీలించారు. తమ ట్రస్టు ద్వారా అంగలూరు డైట్ కళాశాలలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెను సత్కరించారు.
అంగలూరులో పర్యటించిన ఉపరాష్ట్రపతి కుమార్తె
TAGGED:
dhipa venkat visit