కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 'స్వచ్ఛ మసులా' కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. పట్టణంలో గుర్తించిన 14 ప్రధాన ప్రాంతాల్లోని మంచినీరు, మురుగునీటి కాలువలను శుభ్రపరిచేందుకు జిల్లా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ మసులా కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.
ఇదీ చదవండీ :