విజయవాడ నగర శివారు ప్రకాష్ నగర్ లో షేక్ సుభాని అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పాలిష్ కార్మికుడిగా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పోలీసులు ప్రాథమికంగా కుటుంబసభ్యులను.. సుభాని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మద్యానికి బానిసకావడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబీకులు చెబుతున్నారు. ఘటనను నున్న గ్రామీణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: