ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్ పునర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఎన్నికల సంఘం కార్యదర్శి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే తాము విచారణ జరిపి నోటీసులు ఇచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం వచ్చిన పిటిషన్ కూడా వాటితో జతకలిపి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అన్ని కేసులు కలిపి వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాది నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో సుప్రింను ఆశ్రయించింది. ఈనెల 10వ తేదీన విచారణ జరిపిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించి... విచారణ రెండు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న 12 పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది.
'అన్ని పిటిషన్ల పై ఒకేసారి విచారణ చేపడతాం' - nemma gadda ramesh latest news
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పునర్ నియాకాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌పై సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్ పునర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఎన్నికల సంఘం కార్యదర్శి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే తాము విచారణ జరిపి నోటీసులు ఇచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం వచ్చిన పిటిషన్ కూడా వాటితో జతకలిపి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అన్ని కేసులు కలిపి వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాది నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో సుప్రింను ఆశ్రయించింది. ఈనెల 10వ తేదీన విచారణ జరిపిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించి... విచారణ రెండు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న 12 పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది.
ఇదీచదవండి: వీర జవాన్ పళనికి రామనాధపురంలో అంత్యక్రియలు