తాము తీసుకొచ్చిన కలపను సీరియల్ ప్రకారం తీసుకోకుండా, దళారులకు అండగా నిలుస్తున్నాయంటూ.. సుబాబుల్ కంపెనీల తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. సంస్థల తీరుపై కృష్ణా జిల్లా కంచికచర్ల సుబాబుల్ డంపింగ్ యార్డు వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కలపను జాతీయ రహదారిపై వేసి ఆందోళన చేశారు. రవాణా కాంట్రాక్టర్ సొంతంగా రైతుల నుంచి సుబాబుల్ కలపను కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. తాము యార్డుకు తీసుకొచ్చిన కలపను కొనుగోలు చేయటం లేదని ఆవేదన చెందారు. జాతీయ రహదారిపై కలపను అడ్డంగా వేసి ఆందోళన చేసిన కారణంగా.. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతపరిచారు. రహదారిపై నుంచి కలపను తొలిగించారు. రాకపోకలు పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: