"మా విద్యాసంస్థలో కుల, మతాలకు తావుండదు. సర్వమత సమానత్వం" అని విద్యార్థులకు నేర్పుతామని.. విజయవాడలో రైట్ కంప్యూటర్స్ సంస్థ నిర్వహకుడు సయ్యద్ బాషా చెప్పారు. తమ విద్యార్థుల కోరికమేరకు అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలోని విభిన్న మతాలు, జాతుల వర్గాల మేళవింపే భారతీయ సంస్కృతిగా విద్యార్థులు ఈ పవిత్ర కార్యాక్రమానికి భూరివిరాళాలు ఇవ్వటం.. సంతోషంగా ఉందని భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. వివిధ మతాలకు చెందిన విద్యార్థులు తమ శక్తి కొలదీ రామాలయ నిర్మాణానికి విరాళాలు అందజేశారు.
ఇదీ చదవండి: