కృష్ణానదిలో ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్ధిని ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. మచిలీపట్నానికి చెందిన శివప్రసాద్ గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఈరోజు ఉదయం దుర్గా ఘాట్ వద్ద హఠాత్తుగా కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించగా.. ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం వెంటనే స్పందించి యువకుడిని ప్రాణాలను కాపాడింది.
ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపం చెందటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: