కృష్ణా జిల్లా నందిగామ నగరపంచాయతీ పరిధిలోని జీ-ప్లస్ త్రీ ఇళ్లను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. వైకాపా అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణాలను ఆపేసి.. ముఖ్యమంత్రి జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మించి ఇవ్వటానికి గత ప్రభుత్వం జీ-ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా...పేదలకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: