రాష్ట్ర ప్రభుత్వం సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ బోర్డు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉత్తర శాఖ కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ కుటుంబానికి చెందిన పురుషులు మాత్రమే ఆ పదవి చేపట్టాలని మాన్సాస్ ట్రస్ట్ బోర్డు నియమ నిబంధనలు స్పష్టంగా ఉందన్నారు. రెండో తరానికి చెందిన వారసుడు అశోక్ గజపతిరాజు ఉండగానే.. మూడో తరానికి చెందిన మహిళను అర్ధరాత్రి రహస్య జీఓ ద్వారా నియమించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 30 వేల ఎకరాల భూములను కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.
ఇవీ చూడండి...