కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని... రాష్ట్ర పర్యాటక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పర్యటక ప్రాంతాలతో పాటు రోప్‌వే, బోటింగ్ కార్యకలాపాలు, సాహస క్రీడలు, పర్యటక రవాణా కార్యకలాపాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా టూరిజం శాఖ డైరెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లూ యధావిధిగా కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యటక కార్యకాలాపాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని శాఖాపరంగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేట్ క్లబ్ లు, పర్యాటకశాఖకు చెందిన టీడీ1 రూమ్ లు, మిలటరీ క్యాంటీన్లలోను మద్యం విక్రయాలకు అబ్కారీశాఖ అనుమతులు ఇచ్చింది.
ఇదీ చదవండి: పలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు