విజయవాడ చిట్టినగర్‌లో ఉన్న నగరాల సీతారామస్వామి, శ్రీమహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజు వేడుకగా నిర్వహించారు. లక్ష పసుపు కొమ్ముల ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. 108 సుహాసినిలతో సామూహిక కుంకమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు మహిళలకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి అనంతరం మూడు రొజుల పాటు అమ్మవారికి ఇలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటి ఛైర్మన్ పోతీన బేసుకంఠేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండీ...మాడవీధుల్లో నీటి ప్రవాహానికి చెక్.. రూ.కోటితో తితిదే చర్యలు