కృష్ణా జిల్లా మచిలీపట్నంలో.. పోలీసులు సంక్రాంతి సంబరాలు జరుపుకొన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో.. సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. వృత్తిలో నిత్యం బీజీగా గడిపే పోలీసులకు.. సంక్రాంతి పండగకు క్రీడలు నిర్వహించడం ద్వారా మానాసికోల్లాసం లభిస్తుందని అధికారులు తెలిపారు. కోడి పందాలు, పేకాట, పలు జూదపు ఆటలకు యువత ఆకర్షితులవ్వకుండా ఉండేందుకు ఈ పోటీలు దోహదపడతాయని ఎస్పీ తెలిపారు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి క్రీడా పోటీలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.
ఇదీ చదవండి: 'వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తే.. ఆందోళన చేస్తాం'