అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం -కొల్లం-విశాఖపట్నం మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 17 నుంచి జనవరి 19 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.50కి విశాఖపట్నం నుంచి కొల్లంకు, ప్రతి మంగళవారం ఉదయం 10గంటలకు కొల్లం నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక రైళ్లు బయలు దేరతాయి. రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు , నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణమవనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఇసుక కొరతతో.. ఎడ్లబండ్లకు పెరిగిన డిమాండ్