ETV Bharat / state

కృష్ణా డెల్టాలో జోరుగా వరి నాట్లు.. పెట్టుబడి కోసం అన్నదాత ఇక్కట్లు - farmers struggle due no help from govt

కృష్ణా డెల్టా సిరి ధాన్యాలకు నిలయం. కానీ ఈ పరిస్ధితులు క్రమంగా మారుతున్నాయి. పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత, గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, ప్రకృతి వైపరీత్యాలతో పరిస్ధితి తిరగబడుతోంది. గతంలో ఎంతో ఉత్సాహంగా సాగు చేసిన రైతన్నలు నేడు డీలా పడుతున్నారు. ధాన్యం డబ్బులూ సకాలంలో రాకపోవడంతో పెట్టుబడులకూ చేయిచాచాల్సిన దుస్ధితి నెలకొంది.

Krishna delta farmers problems
అన్నదాతను వెంటాడుతున్న కష్టాలు
author img

By

Published : Aug 2, 2021, 2:54 AM IST

ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదలతో కృష్ణా జిల్లావ్యాప్తంగా నాట్లు జోరుగా సాగుతున్నాయి. ముందస్తుగా నారు పోసిన రైతులంతా ఇప్పటికే వరినాట్లు వేయగా.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నాట్లు కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే కోటి ఆశలతో రైతన్నలు ఖరీఫ్ సాగు ప్రారంభించినా... గడిచిన కొన్నేళ్లుగా కృష్ణా జిల్లా రైతులను సమస్యలు కంటనీరు పెట్టిస్తున్నాయి. కరోనాతో ఈ ఏడాది కూలీల కొరత ఎక్కువవడంతో పాటు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడం వీరి కష్టాలకు కారణమవుతున్నాయి. దీంతో పెట్టుబడులు భారంగా మారాయని రైతులు వాపోతున్నారు.

కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపు

గతేడాది పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి అమ్మిన రైతులు... డబ్బుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. పంటల సాగుకు ముందే డబ్బు చేతికి వస్తే విత్తనాలు, ఎరువుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి రాకపోయేది. కానీ సకాలంలో నిధులు రాకపోవడంతో నిరాశే మిగిలింది. నాట్ల సమయం మించిపోతుందని భావించి పెట్టుబడుల కోసం వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేస్తున్నామని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అందని ద్రాక్షగానే గిట్టుబాటు ధర

గిట్టుబాటు ధరలు అందని ద్రాక్షగానే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కోసమంటూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినా తమకు ఏ ప్రయోజనమూ దక్కడం లేదంటున్నారు. దళారులు, అధికారులు కుమ్మక్కై పంటకు తక్కువ ధర నిర్ణయిస్తున్నారని వాపోయారు.. Vox

ప్రకృతి సైతం కన్నీటినే మిగుల్చుతోంది
ప్రకృతి కూడా పగ పట్టినట్లు.. రైతన్నలకు కన్నీటినే మిగుల్చుతోంది. వరుసగా రెండేళ్ల పాటు కృష్ణా నది పొంగడంతో... దిగువన వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈసారీ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుండటంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నష్టాలకు ముగింపు ఎప్పుడువస్తుందా..? అని కృష్ణా డెల్టా రైతులు ఎదురుచూస్తున్నారు. కోటి ఆశలతో సాగు చేస్తున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, ఎరువులపై రాయితీలు పెంచడంతో పాటు... ధాన్యం బకాయిలు సకాలంతో చెల్లించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి..

VISHAKA STEEL FIGHT: దిల్లీకి విశాఖ ఉక్కు కార్మిక నేతలు.. నేడు జంతర్ మంతర్ వద్ద నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.