ETV Bharat / state

రాష్ట్ర అప్పులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు : సీఎం ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి

Special Secretary for Financial Affairs to the Chief Minister : నిబంధనలకు లోబడి ప్రభుత్వం అప్పులు చేసిందని ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాల అప్పులు కూడా పెరిగినా కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ
ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ
author img

By

Published : Feb 14, 2023, 8:22 PM IST

Updated : Feb 15, 2023, 7:16 AM IST

రాష్ట్ర అప్పులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు : సీఎం ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి

Special Secretary for Financial Affairs to CM : కార్పొరేషన్ల అప్పును అప్పుడే చెప్పమని ప్రభుత్వాధికారులు అంటున్నారు. పాత లెక్కలతోనే తాజా రుణాలను లెక్క కట్టాలంటున్నారు. రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం ముఖ్య కార్యదర్శి దువ్వూరి అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అప్పులు చేశారంటూ విమర్శిస్తున్నారు. వివరాలు కావాలంటే దరఖాస్తు చేసుకోండని సూచనలు ఇస్తున్నారు. ‘రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్‌ ప్రభుత్వంలో రుణాలు తగ్గాయి. ఇందుకు ప్రశంసించాల్సింది పోయి లేనిపోని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన స్థాయిలో అప్పులు చేయాలంటే వచ్చే ఏడాదిలోపు ఇంకా రూ.2లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. ప్రతిపక్షాలు, ఇతరులు లేనిపోని అభాండాలు వేస్తున్నారు. అసలు ఆ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెప్పరు’ అని ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ విమర్శించారు.

రుణాల వివరాలను వెల్లడించేందుకు వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వం తరఫున ఆయన.. మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఈ విధంగా ఇచ్చారు.

  • కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రం అప్పు 4 కోట్ల 42 లక్షల 442 రూపాయలకు పెరిగింది. అప్పులు రెండు రెట్లు పెరిగాయని వస్తున్న ప్రచారంలో నిజం లేదు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే 2.4 రెట్ల మేర అప్పులు పెరిగాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వంలో 1.7 రెట్లు మాత్రమే అప్పులు రెట్టింపయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఎలాంటి విపత్తులు సంభవించకపోయినా అప్పులు పెరిగాయి.
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సైతం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్​కి ‘అప్పుల రత్న’ అని పేరు పెట్టాలనీ విమర్శించారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా అలా మాట్లాడటం దురదృష్టకరం.
  • ఆంధ్రప్రదేశ్‌ అప్పులు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయాయని, భవిష్యత్తులో అప్పులను ఎవరు తీరుస్తారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. అసలిదంతా తప్పనీ.. రాష్ట్ర అప్పు 4.42 లక్షల కోట్ల రూపాయలు కాదు.. 9.16 లక్షల కోట్ల రూపాయలని కొత్త ప్రచారం చేస్తున్నారు. నాన్‌ గ్యారంటీ రుణాలు 87 వేల కోట్ల రూపాయలని చెబుతున్నారు. ప్రభుత్వానికి నాన్‌ గ్యారంటీ రుణాలకు ఎలాంటి సంబంధం లేదు? ఆయా సంస్థల సొంత సామర్థ్యం మీద ఆ రుణాలు అధారపడి ఉంటాయి.
  • పెండింగు బిల్లులు 1.85 లక్షల కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఇవి 21,673 కోట్లు రూపాయలుగా ఉన్నాయని నాలుగు నెలల క్రితమే.. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం చివరి నాటికి ఈ బకాయిలు 47,172 కోట్ల రూపాయలుగా ఉంటే వాటిని తీర్చుకుంటూ వస్తే 21,673 కోట్ల రూపాయలకు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. మరి 1.85 లక్షల కోట్ల రూపాయలు అనే అంకె ఎలా వచ్చింది? మరి జీతాలను ఎందుకు ఇవ్వడం లేదు?

విలేకరుల ప్రశ్న : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత భేషుగ్గా ఉంటే మరి ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. జీతాలను సకాలంలో ఇప్పించాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

దువ్వూరి కృష్ణ: అప్పులు, ఆదాయాలు తగ్గినా డీబీటీ ద్వారా ఎక్కువ మొత్తాలను పంపిణీ చేస్తుండటంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తవచ్చు. వేస్‌ అండ్‌ మీన్స్‌ను బట్టి ఒకట్రెండు రోజులు జీతాలు ఆలస్యం కావచ్చు.

విలేకరులు: రాష్ట్రంలో పెండింగు బిల్లుల కారణంగా గుత్తేదారులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెదేపా హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవు కదా..?

దువ్వూరి: అప్పుడున్న వారు ధనిక గుత్తేదారులేమో. ఆ విషయాన్ని నేను చెప్పలేను. ఒకట్రెండు చిన్న బిల్లులు పెండింగులో ఉన్నాయేమో, ఒకటీ అరా ఇబ్బందులు ఎదురైతే మేమెలా చెప్పగలం?

విలేకరులు: కార్పొరేషన్ల అప్పుల లెక్కలను మీరెందుకు బయటపెట్టడం లేదు? వాటిని తేల్చకుండా మొత్తం అప్పు ఎలా తేలుతుంది?

దువ్వూరి: ప్రతి ఏటా అసెంబ్లీలో కార్పొరేషన్ల లెక్కలు వెల్లడిస్తున్నాం.

విలేకరులు: ఎప్పుడో ఏడాది కిందటి లెక్కలనే ఇప్పుడు చెబుతూ.. కొత్త అప్పులతో జతచేస్తే అసలు అప్పు ఎలా తేలుతుంది?

దువ్వూరి: మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు బయటపెడతాం.

విలేకరులు: గ్యారంటీ రుణాలు ఏ నెల ఎంతమేరకు తీసుకున్నారని కాగ్‌ అడుగుతున్నా ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?

దువ్వూరి: రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు వివరాలను అందిస్తూనే ఉంది.

విలేకరులు: కాగ్‌ వెబ్‌సైట్‌లోని ‘మంత్లీ ఇండికేటర్‌’లో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ రుణాల వివరాలు ఇవ్వడం లేదని స్పష్టంగా పేర్కొంటోంది. మీరేమో కాగ్‌కు ఇస్తున్నామని అంటున్నారు..

దువ్వూరి: ఆ విషయం నాకు తెలియదు.

విలేకరులు: కార్పొరేషన్ల అప్పులతోపాటు ఇతర లెక్కల పుస్తకాలన్నీ నిపుణుల కమిటీకి, విలేకరులకు అందుబాటులో ఉంచొచ్చు కదా. దీనివల్ల మొత్తం అప్పెంతో తేలిపోతుంది కదా. పారదర్శకత పాటిస్తే ఈ సమస్య రాదు కదా.

దువ్వూరి: ఆ విషయాన్ని ప్రభుత్వాన్ని లేదా, ఆర్థికశాఖను అడగాలి.

విలేకరులు: ప్రభుత్వం తరఫున మీరే మాట్లాడుతున్నారు కదా..

దువ్వూరి: అయితే దరఖాస్తు చేసుకోండి చూద్దాం.

విలేకరులు: మీరు ద్రవ్యలోటు తగ్గిందని చెబుతున్నారు. ఒకవైపు కార్పొరేషన్ల రుణాల లెక్కలు పాతవే చెబుతున్నారు. మరి ద్రవ్యలోటు వాస్తవంగా ఎలా తేలుతుంది. పాత లెక్కలతో కొత్త అప్పులు, ద్రవ్యలోటు ఎలా తేలుస్తారు?

దువ్వూరి: కార్పొరేషన్ల అప్పులకు దీనికి సంబంధం ఏమిటి?

విలేకరులు: ప్రభుత్వ గ్యారంటీ రుణాలు కూడా ప్రభుత్వ అప్పులే అని ఆర్థిక సంఘం పేర్కొంది కదా.

దువ్వూరి: మీరు దరఖాస్తు చేసుకుంటామన్నారు కదా.. చేయండి.

విలేకరులు: పెండింగు బిల్లులను ప్రతి సంవత్సరం తదుపరి బడ్జెట్‌కు ఎందుకు బదలాయించడం లేదు? అలా బదలాయిస్తేనే మొత్తం బకాయిలు ఎన్నో స్పష్టంగా తెలుస్తుంది కదా.

దువ్వూరి: ఎప్పటికప్పుడు బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు ఇవ్వడం ప్రాసెస్‌లో భాగం
విలేకరులు: ఫిఫో పద్ధతిలో (మొదట సమర్పించిన బిల్లుకు మొదటే చెల్లింపు) బిల్లుల చెల్లింపు ఉంటే సమస్య రాదు కదా?
(ఈ ప్రశ్నకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు.)

ఇవీ చదవండి:

Last Updated : Feb 15, 2023, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.