కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని శ్రీ కొండాలమ్మ దేవాలయంలో ఏడవ రోజు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఈరోజు శ్రీ కొండాలమ్మ దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. మంత్రి కొడాలి నాని దంపతులు అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు.
అమ్మవారి దర్శనానికి వచ్చిన కొడాలి నాని దంపతులకు.. ఆలయ చైర్మన్ రామిరెడ్డి, అలయ అధికారి నటరాజన్ షణ్ముగం, పూజారులు.. పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాని దంపతులను ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దేవాలయం అభివృద్ధిలో భాగంగా రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన లడ్డు ప్రసాదాల తయారీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: