కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి-పాలకాయతిప్ప గ్రామాల శివారు ప్రాంతం కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం. ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఈ ప్రాంతం కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఉంది. ఇక్కడ అనేక వేల పక్షులు, అడవి జంతువులను సంరక్షిస్తాయి. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో ఎక్కువ శాతం మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రదేశంలో వందలాది గోమాతలు మృత్యువాత పడడం చర్చనీయాంశం అయ్యింది. వన్యప్రాణులు ఈ మడ చెట్ల ఆకులు తింటూ జీవిస్తూ ఉంటాయి. మడచెట్లు కాయలు ముదిరిన తరువాత రాలిపోయినవి నీటిలో కొట్టుకుపోతాయి. కాయల్లో ఇసుకచేరి ఆవులు వాటిని తినడం వలన జీర్ణ వ్యవస్థలో గ్యాస్ రావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడం వలన మరణిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఆవులను పెంచడం ఆచారం
కోడూరు మండలం, హంసలదీవి గ్రామంలో చారిత్రక వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి కుటుంబం కొన్ని ఆవులనైనా పెంచడం తరతరాల ఆచారంగా కొనసాగుతోంది. స్వామి ఉత్సవాల సమయంలో ఈ గోవులను స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు పొలాల్లో వరి పంట సాగు చేయడం వలన.. ఆవులు ఆహారం కోసం కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్న మడ చెట్ల ఆకులను తింటాయి. యజమానులు వీటిని వదిలేస్తూ ఉంటారు. ఈ గోవుల మందలు కొన్ని గ్రామాల్లో వరి పంటను తినేయడం వల్ల రైతులు పోలీసు కేసు పెట్టడం వల్ల.. గో సంరక్షణ వారితో కలసి కొన్ని గోవులను షరతులతో రైతువారి పెంపకానికి ఇచ్చారు.
వందలాది గోవుల మరణం
కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో విపరీతంగా మడకాయలు తినడం వలన ఏటా వందలాది గోవులు సముద్రం ఒడ్డున మరణిస్తున్నాయి. ఇలా ఆవులు మరణించడం వలన అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మా గోపాల గోకుళం గోసేవా ట్రస్టు 5/2020 ద్వారా ఈ 3 నెలలపాటు సముద్రం పక్క గ్రామాల్లో ఫెన్సింగ్ వేసి వాటిలోనే గోవులకు ఆహారం, నీరు, ఇతర వైద్యం అందిస్తామని చెప్పారు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్కు,బందరు ఆర్డీవో, కోడూరు తహసీల్దార్, కోడూరు పోలీసు వారికి అర్జీలు ఇచ్చారు. అధికారులు స్పందించి ఈ గోవుల మందలో ఉన్న సుమారు 800 ఆవులను సంరక్షిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి..
బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం...రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం