కృష్ణా జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై నిత్యం 1100 మందికి వరకు జరిమానాలు విధిస్తున్నట్లు ఎస్పీ రవీంద్ర బాబు తెలియజేశారు. గుడివాడ పట్టణంలో 12 గంటల తర్వాత పోలీసు అధికారులతో కలిసి ప్రధాన రహదారులలో కర్ఫ్యూ అమలు తీరును ఎస్పీ పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కర్ఫ్యూ నిబంధనలను, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాటిస్తున్నారని ఆయన అన్నారు. కొందరు వ్యక్తులు కర్ఫ్యూ నిబంధనలను అతి క్రమిస్తున్నారని వారిపై చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యానందం, సీఐలు గోవిందరాజు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
గుడివాడలో కర్ఫ్యూ తీరును పరిశీలించిన ఎస్పీ
కృష్ణా జిల్లా గుడివాడలో కర్ఫ్యూ తీరును ఎస్పీ పరిశీలించారు. రోజూ 1100 మందికి వరకు జరిమానాలు విధిస్తున్నామని ఆయన అన్నారు. అవసరం లేకుండా బయటికి రావొద్దని ఆయన సూచించారు.