ETV Bharat / state

కరోనాపై ప్రజా గాయకుడి సందేశం - కరోనాపై ప్రజా గాయకుడు శ్రీనివాసరావు పాడిన పాట

కరోనాపై వివిధ రూపాల్లో కళాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో తన పాట ద్వారా తగు సూచనలు చేస్తున్నారు ప్రజా గాయకుడు ఎన్​.శ్రీనివాసరావు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ కొనుగోలు కేంద్రాల వద్ద పాట పాడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

కరోనాపై ప్రజా గాయకుడు పాట
కరోనాపై ప్రజా గాయకుడు పాట
author img

By

Published : Apr 18, 2020, 3:54 PM IST

కరోనాపై ప్రజా గాయకుడి సందేశం

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు పలువురు కళాకారులు ముందుకొస్తున్నారు. కృష్ణా జిల్లా గంటశాలకు చెందిన ఎన్.శ్రీనివాసరావు తన పాటలతో ప్రజలకు పలు సూచనలు చేశారు. 'కరోనా రక్కసి కన్నేర్ర జేసే ప్రపంచంలోనా... ప్రజల ప్రాణాలకే ముప్పు ముంచుకొచ్చే దేశదేశాలలోనా' అని పాట పాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రాకూడదన్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకుల కేంద్రాల వద్దకు వచ్చి తన పాట ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రజల కోసం సేవ చేస్తున్న శ్రీనివాసరావును అధికారులు అభినందించారు.

ఇదీ చూడండి:

కరోనాపై పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.