ETV Bharat / state

'ప్రభుత్వ నిర్వాకంతో 16 వేల మంది బీసీలకు అన్యాయం' - స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయంపై కళా వెంకట్రావ్ మండిపాటు

రాష్ట్రం ప్రభుత్వం బీసీలపై పక్షపాతం చూపుతోందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. స్థానికసంస్థల ఎన్నికల్లో 16వేల మంది బీసీలకు సరైన న్యాయం జరగలేదని అన్నారు. వైకాపా ప్రభుత్వం బీసీల గొంతుపై కత్తి పెట్టి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని విమర్శించారు.

'వైకాపా ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోంది'

author img

By

Published : Mar 7, 2020, 7:04 AM IST

'వైకాపా ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోంది'

బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. బీసీలు, మైనార్టీలు ప్రభుత్వ కుట్రను గమనించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల స్థానిక ఎన్నికల్లో 16 వేల మంది బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఓటు అనే ఆయుధం మరొకసారి వచ్చింది కాబట్టి ప్రజలు అందరూ ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని చోట్లా పోటీ చేస్తామన్న కళా వెంకట్రావు...పొత్తుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో అధికారులు అర్ధరాత్రి విడుదల చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల జాబితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలో 46 జడ్పీటీసీలుంటే బీసీలకు 6 సీట్లు కేటాయించగా, 562 ఎంపీటీసీలకు గాను 59 స్థానాలు మాత్రమే కేటాయించారన్నారు. 15మండల్లాలో బీసీలకు అసలు ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా కేటాయించకపోవటం దారుణమన్నారు. మరికొన్నిమండలాల్లో ఒకటి, రెండు స్థానాలతో సరిపెట్టారన్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. వైకాపా ప్రభుత్వం బీసీల గొంతుపై కత్తి పెట్టి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు వెంటనే స్పందించి పొరపాట్లను సరిదిద్ది నిర్ణీత దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సివస్తుందని హెచ్చరించారు.

ఇవీ చదవండి

'స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.