ఇన్వెంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొద్ది రోజులుగా కొవిడ్-19 నియంత్రణ కోసం తమ వంతు పాత్ర పోషిస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలంలోగల పలు గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ రసాయన ద్రావణాన్ని, బ్లీచింగ్ పౌడర్‌ను పిచికారీ చేయిస్తున్నారు. ఇప్పటికే రాఘవాపురం, కమ్మవారిపాలెం, ముప్పాళ్ల, పెద్దవరం, గండేపల్లి, చెరువుకొమ్ముపాలెం, కొత్త బెల్లము కొండవారి పాలెం, కంచెల, చందాపురం, పెండ్యాల, కాకరవాయి, కంచికచర్ల గ్రామాలలో పూర్తి చేసి నేడు నందిగామ పట్టణంలో పిచికారీ చేయించారు. వలస కూలీలకు ఆహార పొట్లాలు అందించారు.
ఇదీ చూడండి: