కృష్ణాజిల్లా నందిగామ రైతు బజార్ వద్ద చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. రోడ్డు పక్కన ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు తమ దుకాణాలను తొలగించవద్దంటూ.. ఉల్లిపాయలు, ఇతర సామాగ్రిని పారబోసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరితో పాటు.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆందోళనలో పాల్గొన్నారు. చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా నాశనం చేయటం తప్ప.. అభివృద్ధి చేసింది శూన్యమని విమర్శించారు.
ఇదీ చదవండీ.. vijayasai reddy: 'నా పేరున ఇప్పటివరకు విశాఖలో స్థలాలు, భూములు లేవు