ETV Bharat / state

నర్సింగ్‌ స్టాఫ్‌ కొరత...ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు - Krishna District news

రోగులకు చికిత్సతో పాటు కొండంత ఆత్మస్థైర్యం నింపే మాటలు అవసరం. ఇది కేవలం వైద్య సేవలు అందించే నర్సుల వల్లే సాధ్యం. అలాంటి నర్సింగ్ స్టాఫ్ కొరత కారణంగా...ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Shortage of nursing staff in Krishna district

author img

By

Published : May 4, 2021, 1:07 PM IST

విజయవాడ జీజీహెచ్‌లో ఒక రోగికి సెలైన్‌ ఎక్కిస్తున్నారు. బాటిల్‌ అయిపోయినా.. దాన్ని నిలుపుదల చేసేందుకు ఎవరూ లేకపోవడంతో శరీరం నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. అప్పటికప్పుడు ఒకరు వచ్చి నిలుపుదల చేశారు. ఇది సాధారణ వార్డులో పరిస్థితి. అదే జీజీహెచ్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కారణం నర్సింగ్‌ స్టాఫ్‌ కొరత. ఒక్క విజయవాడలోనే కాకుండా జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ నర్సింగ్‌ స్టాఫ్‌ కొరత తీవ్రంగా ఉంది.

రోగులకు చికిత్సతో పాటు కొండంత ఆత్మస్థైర్యం నింపే మాటలు అవసరం. ఇది కేవలం వైద్య సేవలు అందించే నర్సుల వల్లే సాధ్యం. చికిత్సతో పాటు భరోసా కల్పించే మాటలు రోగుల్లో ధైర్యాన్ని నింపుతాయి. అదే చికిత్సకు ఎంతో దోహదపడుతుంది. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రోగులకు కనీస సేవలు అందించే వారు కరవయ్యారు. ఒకవైపు రోగుల సంఖ్య ఎక్కువవడంతో పడకల సంఖ్యను పెంచుతున్నారు. ఇన్‌పేషంట్లు ప్రధానంగా ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. వారికి తగిన సమయంలో మందులు అందించడం, సూదిమందు ఇవ్వడం లాంటివి ఇవ్వడానికి అవసరమైన నర్సింగ్‌ స్టాఫ్‌ లభించడం లేదు. ఒప్పంద ఉద్యోగులుగా నియమించేందుకు నోటిఫికేషన్‌లు ఇస్తున్నా.. ఎవరూ ముందుకు రావడం లేదు.

* పిన్నమనేని ఆసుపత్రిలో 250 నుంచి 500 వరకు పడకలు పెంచారు. ఇక్కడ నర్సింగ్‌ విద్యార్ధులకు విధులు వేశారు. కేరళకు చెందిన విద్యార్థులను వారి సొంత రాష్ట్రానికి పంపించారు. స్థానికంగా ఉంటున్న 35 మంది విధులు వేయడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి సంవత్సరంలో ఉన్న తమ పిల్లలకు విధులు ఎలా అప్పగిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

* నిమ్రా ఆసుపత్రిలోనూ వారి సొంత నర్సింగ్‌ కళాశాల విద్యార్థులనే నియమించారు. ఇక్కడ 500 పడకలు ఏర్పాటు చేశారు. 250 వరకు ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. ఆక్సిజన్‌ స్థాయిలు పరిశీలించడం.. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చేయాల్సి ఉంది. దాదాపు మరో 100 మంది ఉంటేనే పూర్తి స్థాయిలో సేవలు అందించే పరిస్థితి.

సరిపడా లేరు...: కృష్ణా జిల్లాలో కరోనా రెండో దశ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున 900 మందికి పాజిటివ్‌ నమోదవుతోంది. వీరిలో 25శాతం ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఆరాటపడుతున్నారు. మిగిలిన 75 శాతం ఇంటి వద్ద, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల వద్ద ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఆసుపత్రుల్లో స్టాఫ్‌ కొరత తీవ్రంగా ఉంది. దీంతో నర్సింగ్‌ విద్యార్థినులను విధులు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆఖరి సంవత్సరంలో ఉన్న వారికి నర్సింగ్‌పై పూర్తి అవగాహన ఉంటుంది. కానీ రెండు, మూడో ఏడాది కోర్సు చేస్తున్నవారినీ వినియోగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 76 ఆసుపత్రుల్లో దాదాపు 4వేల పడకలు ఏర్పాటు చేస్తున్నారు. 4వేల మందికి దాదాపు 2వేల మంది నర్సింగ్‌ స్టాఫ్‌ కావాల్సి ఉంది. షిప్టుల వారీగా పనిచేయాల్సి ఉంది. కానీ అంతమంది జిల్లాలో లేరు.

* బందరులోని జిల్లా ఆసుపత్రిలో దాదాపు 300 పడకలు ఉన్నాయి. అదనంగా మరో 50 ఏర్పాటు చేశారు. ఇక్కడ నర్సింగ్‌ విద్యార్థులను నియమించారు. వారు కూడా సరిపోవడం లేదు.

* ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ కొరత ఉంది. ఇక్కడ కొంతమందిని రెండు షిప్టులు విధులు వేస్తున్నారు. అదనపు డ్యూటీ చేయిస్తున్నట్లు తెలిసింది.

జీజీహెచ్‌లో ఇలా...

జీజీహెచ్‌లో మొత్తం 750 పడకలు ఉన్నాయి. మరో 100 పెంచారు. ఐసీయూ, వెంటిలేటర్‌ పడకలు మరో 175 వరకు ఉన్నాయి. ఐఎంఏ నిబంధనల ప్రకారం ఐసీయూలో ఒక రోగికి ఒక నర్సు తప్పనిసరిగా ఉండాలి. ఆక్సిజన్‌ పడకల వార్డుల్లో ప్రతి ఏడుగురికి ఒక నర్సు ఉండాలి. కానీ జీజీహెచ్‌లో 80 మంది రోగులకు షిఫ్టుకు ముగ్గురు చొప్పున 9 మందినే ఇస్తున్నారు. కేవలం ముగ్గురు.. 80 మంది బాగోగులు, మాత్రలు ఇవ్వడం, ఇంజక్షన్లు ఇవ్వడం చూడటం అసాధ్యం.

* సాధారణ రోగులు అయితే.. రోగి వెంట సహాయకులుగా బంధువులను ఒకరిని అనుమతిస్తారు. రోగికి ఏదైనా సమస్య వస్తే నర్సుకు చెపితే.. ఆమె షిప్టు డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్తారు. ప్రస్తుతం కరోనా రోగుల వెంట సహాయకులు లేరు. అన్నీ నర్సులే చూసుకోవాల్సి వస్తోంది. ఇది కష్టంగా మారుతుంది. కొంతమంది నర్సులకూ చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు. జీజీహెచ్‌లో మొత్తం నర్సింగ్‌ స్టాఫ్‌ 200 మంది ఉన్నారు. వీరినే షిప్టుల వారీగా నియమిస్తున్నారు. కొంతమంది కొవిడ్‌ ప్రభావంతో విధులకు హాజరు కావడం లేదు.

నర్సింగ్‌ సేవలు ప్రధానం..

రోగుల చికిత్స విషయంలో నర్సింగ్‌ ఎంతో ముఖ్యం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నర్సులు ఒక రోగికి ఒకరు చొప్పున ఉండాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అంకిత భావంతో సేవలు అందించే వారు కావాలి. విధి నిర్వహించినట్లు కాకుండా రోగికి సాంత్వన చేకూర్చే విధంగా ఉండాలి. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

- డాక్టర్‌ సుభాష్‌చంద్రబోస్‌, ఐఎంఏ ప్రతినిధి

ఇదీ చదవండి

రాబడి అంచనాల్లో రూ.50 వేల కోట్లు హుష్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.