కృష్ణా జిల్లా ఘంటసాల పెద్దగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరపల్లి అంకినీడు కొత్తగా ఇంటిని నిర్మించుకుని... గృహ ప్రవేశం కార్యక్రమం జరుపుకుంటున్నాడు. అప్పటిదాకా కొత్త ఇంట్లో బంధువులతో సరదాగా గడిపిన అంకినీడు... విద్యుదాఘాతంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: పొలానికెళ్లినా...ఇంట్లో ఉన్నా..అదే భయం!