రాష్ట్రంలో ఇసుక, మద్యం తదితర అక్రమ రవాణాను నియంత్రించేందుకు... 439 చెక్ పోస్టులను అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. సచివాలయంలో చెక్ పోస్టుల ఏర్పాటు విషయమై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత చెక్ పోస్టుల నిర్మాణం, సిబ్బంది నియామకాన్ని చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రతీ చెక్ పోస్టులోనూ ఒక పోలీస్తోపాటు మరో ముగ్గురు ఇతర ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. చెక్ పోస్టుల్లో సీసీ కెమెరా ఏర్పాటు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్డి వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. చెక్ పోస్టులు ఏర్పాటు నిర్వహణ విషయంలో భూగర్భ గనులు శాఖ పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి: బాలికపై వృద్ధుడి అత్యాచారం.. తల్లే సహకరించింది..!