ETV Bharat / state

వైకాపా రాజ్యసభ సభ్యుల్లో 50% మందిపై తీవ్రమైన కేసులు - వైకాపా రాజ్యసభ సభ్యులు వార్తలు

రాజ్యసభకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. వైకాపా ఎంపీల్లో 50% మందిపై కేసులున్నాయని పేర్కొంది.

ycp Rajya Sabha members
ycp Rajya Sabha members
author img

By

Published : Jul 23, 2020, 10:29 AM IST

రాజ్యసభకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో 24 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సంస్థ పేర్కొంది. నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. 233 స్థానాలున్న రాజ్యసభలో 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కేరళ ఎంపీ కేకే రాగేష్‌ అఫిడవిట్‌ అందుబాటులో లేక అధ్యయనం చేయలేదని పేర్కొంది. మిగిలిన 229 మందిలో 54 మందిపై(24%) క్రిమినల్‌ కేసులున్నాయి. ఆర్‌జేడీ ఎంపీల్లో 80%, ఆప్‌, శివసేన ఎంపీల్లో 67%, వైకాపా, ఎన్‌సీపీ, సీపీఎం ఎంపీల్లో 50% చొప్పున కేసులున్నవారే. తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఆర్‌జేడీ ఎంపీల్లో 60% మందిపై, వైకాపా ఎంపీల్లో 50% మందిపై ఉన్నాయి. పెద్దల సభలో కోటీశ్వరులే అధికంగా ఉన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది.

  • రాజ్యసభలో ఒక్కో సభ్యుడి సగటు ఆస్తి విలువ రూ.62.67 కోట్లు. ఇందులో 86 మంది(37%) ఆస్తుల విలువ రూ.10 కోట్ల కంటే అధికంగా ఉంది. 36 మంది ఆస్తులు (16%) రూ.5-10 కోట్ల మధ్య, 81 మందివి (35%) రూ.1-5 కోట్ల మధ్య, 22 మందివి (10%) రూ.20 లక్షలు- రూ.కోటి మధ్య, నలుగురివి(2%) రూ.20 లక్షల్లోపు ఉన్నాయి.
  • తెరాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురూ కోటీశ్వరులే. వైకాపా సభ్యులు ఆరుగురిలో ఐదుగురు కోటీశ్వరులు. భాజపాలో 90%, కాంగ్రెస్‌లో 93% మంది ఎంపీలు కోటీశ్వరులు.
  • రూ.4,078 కోట్ల ఆస్తులతో బిహార్‌ జేడీయూ ఎంపీ మహేంద్రప్రసాద్‌ అత్యంత సంపన్న ఎంపీగా నిలిచారు. రూ.2,577 కోట్ల ఆస్తులతో వైకాపా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
  • అప్పుల విషయంలో వైకాపాకు చెందిన పరిమళ్‌ నత్వాని(రూ.209 కోట్లు), ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (రూ.154 కోట్లు), జయాబచ్చన్‌ (రూ.105 కోట్లు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
  • వార్షిక ఆదాయపరంగా జేడీయూ ఎంపీ మహేంద్రప్రసాద్‌ (రూ.303 కోట్లు), అయోధ్య రామిరెడ్డి (రూ.262 కోట్లు), అభిషేక్‌ మనూ (రూ.130 కోట్లు) తొలి స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చదవండి

ప్రభుత్వం ఏమైనా దివాలా తీసే స్థితిలో ఉందా: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.