కరోనా వ్యాక్సిన్ రెండో విడత డోస్‌ను ఇవాళ్టి నుంచి పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. వైద్యారోగ్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది.. మొదటి డోస్ ఎక్కడ వేసుకున్నారో రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి డోస్ ఏ కంపెనీది వేసుకున్నారో రెండో డోస్ కూడా అదే కంపెనీది వేసుకోవాలని సూచించింది. 28 రోజుల తర్వాత రెండో డోస్ వేసుకోవాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని వైద్యారోగ్య శాఖ వర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బంది మొదటి డోస్ ఈనెల 25 లోగా వేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 25 తర్వాత వీరికి మొదటి డోస్ వేసేందుకు అవకాశం లేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇతర శాఖల సిబ్బంది మార్చ్ 5లోగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు