ETV Bharat / state

వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది: ఎస్​ఈసీ నిమ్మగడ్డ - పదవీ విరమణ

రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​గా ఇవాళ పదవీ విరమణ చేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా తనకు ప్రజలు, మీడియా చాలా బాగా సహకరించారని పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న నిమ్మగడ్డ.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మంచి పద్ధతి అమలులో ఉందని స్పష్టం చేశారు.

ఇవాళ పదవి విరమణ చేయబోతున్నా : ఎస్​ఈసీ నిమ్మగడ్డ

author img

By

Published : Mar 31, 2021, 11:11 AM IST

Updated : Mar 31, 2021, 12:35 PM IST

ఇవాళ పదవి విరమణ చేయబోతున్నా: ఎస్​ఈసీ నిమ్మగడ్డ

నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​గా పదవీ విరమణ చేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా తనకు ప్రజలు, మీడియా నుంచి అపూర్వ సహకారం అందిందని వెల్లడించారు. రీపోలింగ్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభించినట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. కొంతమంది అనాగరిక చర్యలు వ్యవస్థపై ప్రభావం చూపాయన్నారు. ఎవరో ఒకరు చేసే అనాగరిక చర్యల వల్ల వ్యవస్థపై ప్రభావం చూపిందన్న నిమ్మగడ్డ.. సిబ్బంది మూకుమ్మడి సెలవుపై పంపించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని చెప్పుకొచ్చారు.

హైకోర్టు సహకారం..

తమ బాధ్యతల నిర్వహణలో హైకోర్టు సంపూర్ణ సహకారం అందించిందన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కమిషనర్ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మంచి పద్ధతి అమలులో ఉందని ఈ సందర్భంగా ఎస్‌ఈసీ తెలిపారు.

సీఎస్, డీజీపీకి ప్రశంసల జల్లు..

సీఎస, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని నిమ్మగడ్డ ప్రసంశించారు. అన్ని వ్యవస్థలు, అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగానన్నారు. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుందన్నారు.

అలా చేస్తే శాశ్వత ప్రయోజనాలు..

తాను సిఫార్సు చేసిన సంస్కరణలు అమలు చేస్తే శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయన్నారు. తాను తెలంగాణలో ఓటు హక్కు తీయించుకుని గుంటూరులోని స్వస్థలంలో ఓటు హక్కుకు చేసిన దరఖాస్తు ఇంకా పెండింగ్​లోనే ఉందన్నారు. త్వరలోనే న్యాయపోరాటంతో ఆ హక్కును సాధించుకుంటానని స్పష్టం చేశారు.

'గవర్నర్​కు అందిస్తా'

అధికారిక సమాచారాన్ని నివేదిక రూపంలో క్రోడీకరించి గవర్నర్‌కు అందిస్తానని తెలిపారు. అధికారిక సమాచారాన్ని తానెప్పుడూ లీక్ చేయలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పని చేయాలనేదే తన అభిప్రాయమని కమిషనర్ చెప్పారు.

ఇవీ చూడండి : మువ్వన్నెలు విరిసిన వేళ..శత వసంతాల హేల..!

Last Updated : Mar 31, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.