ETV Bharat / state

పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఎస్​ఈసీ ఆగ్రహం - ఏపీ పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై తాజా వార్తలు

పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిదఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆన్​లైన్ ద్వారా స్వీకరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండో దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం నాటికి ఆన్​లైన్​లో నామినేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు.

sec nimmagadda ramesh kumar  angry with Panchayati Raj
పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఎస్​ఈసీ ఆగ్రహం
author img

By

Published : Feb 1, 2021, 12:39 PM IST

తొలి దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆన్​లైన్ ద్వారా స్వీకరించకపోవడంపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల మీద... ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్​లైన్​లో నామినేషన్లు తీసుకోవాలని తాను ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై.. నిన్న ఎస్ఈసీ ఇచ్చిన నోటీసుకు సంజాయిషీ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది.. ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ను కలిశారు.

తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై.. గంటపాటు జరిగిన సమావేశంలో ఎస్ఈసీ కారణాలు తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్ అధికారులు ఇచ్చిన సమాధానంపై... ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెండో దఫా నామినేషన్ల ప్రారంభం నాటికి ఆన్​లైన్​లో ప్రక్రియ ప్రారంభించాలని నిమ్మగడ్డ ఆదేశించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

నిమ్మాడ ఘటనపై ఎస్​ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.