మార్చి ఒకటో తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు అనుమతి ఇవ్వటంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ అఖిలపక్ష భేటీకి వివిధ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించిన ఎస్ఈసీ... పార్టీల నుంచి ఒక్కో ప్రతినిధి హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పార్టీ నేతలను కోరనున్నారు. రాజకీయపక్షాల నుంచి ఎన్నికల నిర్వహణలో సూచనలు, సలహాలను ఎస్ఈసీ స్వీకరించనున్నారు.
ఇదీచదవండి.