ETV Bharat / state

SEC: హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల ఫలితాలపై ఎస్‌ఈసీ కసరత్తు

High Court
హైకోర్టు
author img

By

Published : Sep 16, 2021, 1:55 PM IST

Updated : Sep 17, 2021, 12:34 AM IST

13:54 September 16

SEC exercise on election results in the wake of High Court orders

హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్​పై రాష్ట్ర ఎన్నికల కమిషన్( ఎస్​ఈసీ) కసరత్తు ప్రారంభించింది. తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం కౌంటింగ్ తేదీలపై నిర్ణయం తీసుకోవాని భావిస్తున్నట్ల తెలిసింది. దీనిపై సీఎస్, డీజీపీలతో సమావేశం కానున్న ఎస్ఈసీ.. కౌంటింగ్ తేదీలను ఖరారు చేయనున్నట్టు సమాచారం.

జెడ్పీడీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 8 తేదీన ఎన్నికలను నిర్వహించారు. 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు గానూ.. 126 ఏకగ్రీవం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్​కు సంబంధించిన తేదీని ఎస్ఈసీ త్వరలో ఖరారు చేయనుంది.

ఇదీ చదవండి:  CM Jagan: పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్

Last Updated : Sep 17, 2021, 12:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.