దివిసీమలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన - దివిసీమలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా తాజా వార్తలు
ఎస్బీఐ బ్యాంకు ఉగ్యోగుల యూనియన్ పిలుపు మేరకు కృష్ణాజిల్లా దివిసీమలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాకు చెందిన 6 బ్రాంచ్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆందోళన చేశారు. అవనిగడ్డ ఏడీబీ బ్రాంచి ముందు సుమారు 30 మంది సిబ్బంది నిరసన తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని.. వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలంటూ నినాదాలు చేశారు.