విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలోని గోశాలలో విశ్వహిందూ పరిషత్తు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గోపరివార్ సంయుక్త కార్యాచరణ కమిటీ పర్యవేక్షణలో గోవులు అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు 600 మంది సేవలను పెట్రోలింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు వీహెచ్‌పీ నేతలు పేర్కొన్నారు. గోపూజ కార్యక్రమంలో తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి పాల్గొన్నారు. 'గోవును మాతగా పూజిద్దాం... గోవును రక్షిద్దాం' అనే నినాదంతో రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి గుడివాడలో 40 కేజీల గంజాయి స్వాధీనం