ఏపీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పరిధిలో ఉన్న ఇసుక తవ్వకాలు, విక్రయాలను జై ప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ గనుల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి మూడు జోన్లుగా విభజించి నిర్వహించిన టెండర్లలో జేపీ పవర్స్ అధిక మొత్తాన్ని కోట్ చేసి మూడు జోన్లనూ దక్కించుకుంది. అవసరమైన బ్యాంకు పూచీకత్తులను ఏప్రిల్ 9న సమర్పించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
కొంత వ్యవధి ఇవ్వాలి..
కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టలేమని, కొంత వ్యవధి ఇవ్వాలని ఆ సంస్థ కోరడంతో ఒప్పందం అమలులో జాప్యం జరిగింది. బుధవారం నుంచి ఇసుక తవ్వకాల బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు సమావేశం..
ఇసుక తవ్వకాల నిర్వహణపై గనుల శాఖ అధికారులు, జేపీ పవర్స్‌తో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం వీడియో సమావేశం నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి : బ్లాక్ ఫంగస్: ఔషధం ఉత్పత్తికి సన్నాహాలు