ETV Bharat / state

సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి - etv bharat telugu updates

కృష్ణాజిల్లాలోని తాడిగడప వార్డు సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగి తన నివాస ప్రాంతం వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

sachivalayam employee suspicious death at krishna
సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి
author img

By

Published : Jun 10, 2020, 11:54 AM IST

కృష్ణా జిల్లాలో ఓ సచివాలయ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల ప్రకారం... తాడిగడప వార్డు సచివాలయం-3లో విధులు నిర్వహిస్తోన్న ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన సూర్యారెడ్డి తను నివాసం ఉంటున్న వసంతనగర్​లోని గదిలో విగతజీవిగా పడిఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా... పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏదైనా పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకంపై నేడు సుప్రీంలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.