తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రులు, అధికారుల మధ్య నాలుగో విడత చర్చలు విఫలం కావడంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేశామని విజయవాడ జోనల్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు చేశామని...రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నుంచి గరికపాడు వరకు, గుంటూరు, పశ్చిమగోదారి జిల్లాల్లోని సరిహద్దుల వరకు సర్వీసులు నడిచేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి.