కృష్ణాజిల్లా కైకలూరు మండలంలోని ఆటపాక సమీపంలో ఓ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. నూజివీడు నుంచి భీమవరం వైపు ప్రయాణిస్తున్న కారు ఆటపాక వద్ద ఓ సైకిల్‌ను తప్పించే క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది. ఇదే సమయంలో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు కారును తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మరొక బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు చేరుకుని పరిస్థితిని యథాస్థితికి తీసుకువచ్చారు.
ఇవీ చదవండి: