ETV Bharat / state

ఆర్టీసీ ప్రయాణీకులపై రూ.700 కోట్ల భారం - ఏపీ ఆర్టీసీపై అసెంబ్లీలో చర్చలు

ఏపీఎస్​ఆర్టీసీ పెంచిన ఛార్జీలు ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయనున్నాయి.ఏడాదికే రూ.700 కోట్ల మేర భారం పడనుంది.

ఆర్టీసీ ప్రయాణీకులపై రూ.700 కోట్ల భారం
ఆర్టీసీ ప్రయాణీకులపై రూ.700 కోట్ల భారం
author img

By

Published : Dec 9, 2019, 6:50 AM IST

ఏపీఎస్‌ఆర్టీసీ పెంచిన బస్సు ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.700 కోట్ల మేర భారం పడనుంది. రోజుకు సగటున రూ.2 కోట్ల మేర అదనంగా ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతం సంస్థకు ఏటా రూ.1200 కోట్ల మేర నష్టం వస్తోంది. పెంచిన ఛార్జీలతో కొంత మొత్తం సర్దుబాటు కానుంది. ఛార్జీల పెంపుదల నేపథ్యంలో ఆర్డినరీ సిటీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10 కానుంది. పల్లెవెలుగులో దూరాన్ని బట్టి రూపాయి నుంచి గరిష్ఠంగా రూ.5 వరకు పెరగనుంది. రాష్ట్రంలో నిత్యం 62 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో 20 లక్షల మంది విద్యార్థి పాస్‌లు గలవారే.

మరో 30 లక్షల మంది పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో... మిగిలిన 12 లక్షల మంది ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రాడీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లో వెళ్తున్నారు. ఆర్టీసీకి రోజుకు సగటున వచ్చే రూ.13.5 కోట్ల ఆదాయంలో సగం పల్లెవెలుగు ద్వారా.. మిగిలిన సగం ఇతర సర్వీసుల ద్వారా వస్తోంది.

దస్త్రాన్ని పంపిన అధికారులు
ఛార్జీల పెంపునకు సంబంధించిన దస్త్రాన్ని ఆర్టీసీ అధికారులు సిద్ధం చేసి నిన్న ప్రభుత్వానికి పంపారు. ఉత్తర్వులు రాగానే నేటి అర్ధరాత్రి నుంచే ఛార్జీలు పెరగనున్నాయి. దాంతో టిక్కెట్‌ జారీ యంత్రాల(టిమ్‌)ను అప్‌డేట్‌ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసి ఉంచారు.

ఆర్టీసీ విలీనానికి రెండు బిల్లులు

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలుగా నేటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే సంబంధిత బిల్లులకు సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటికి ఆమోదం లభించిన తర్వాత విలీన ప్రక్రియ ముగించేలా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన అధ్యయన బృందం తమ నివేదికను ఇటీవల ఉన్నతాధికారుల కమిటీకి అందజేసింది. ఆ కమిటీ దీనిని ప్రభుత్వం ముందు ఉంచనుంది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోరాదంటూ 1997లో బిల్లు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను మాత్రమే తీసుకునేందుకు వీలుగా సవరణ బిల్లును ప్రవేశపెడతారు.
* కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి మరో బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమోదం పొందిన తర్వాత జనవరి ఒకటో తేదీ నాటికి 52 వేల మంది ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఈ శాఖలో ఉద్యోగులుగా చూపుతారు.
* ఈ రెండు బిల్లుల్లో ఏయే అంశాలు పొందుపరిచారన్న దానిపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది, కార్మికులు, సంఘాలు చేసిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుందా? లేదా? వంటి అంశాల స్పష్టతకు వారు ఎదురుచూస్తున్నారు.
సంఘాలను భాగస్వామ్యం చేయలేదు: ఈయూ
విలీనం సందర్భంగా నిబంధనలు మార్పులు, చేర్పులు చేస్తుండగా.. ఇందులో కార్మిక సంఘాలను భాగస్వాములను చేయకుండా, ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఇస్తుండటం బాధాకరమని ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి

ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఛార్జీల పిడుగు !

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.