ETV Bharat / state

విత్తనం వేయకుండానే...12 ఎకరాల్లో మొలకెత్తిన వరి - విత్తనం లేకుండానే మొలకెత్తిన వరి

రకరకాల వరి విత్తనాలు వివిధ పద్ధతుల్లో పొలంలో వేసి వరి పంట పండించడం మనకు తెలుసు.. కాని ఒక్క వరి గింజ కూడా పొలంలో జల్లకుండా... గత సంవత్సరం కోత కోసినప్పుడు పండిన ధాన్యంతో పన్నెండెకరాల్లో వరి పండించి అధిక దిగుబడులు సాధించాడు ఓ రైతు. అతనే కృష్ణా జిల్లాకు చెందిన వెంకట చలపతిరావు.

rice cultivation
rice cultivation
author img

By

Published : Nov 28, 2019, 7:03 AM IST

Updated : Nov 28, 2019, 7:28 AM IST

విత్తనం వేయకుండానే...12 ఎకరాల్లో మొలకెత్తిన వరి

కృష్ణా జిల్లా దివిసీమలో సుమారు లక్షా యాభై వేల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్​లో కాల్వల మీద ఆధారపడి రైతులు వరి సాగుచేస్తారు. నేల స్వభావాన్ని బట్టి ఒక్కో ఎకరానికి సుమారు 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. కొందరు రైతులు పాత పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతులైన వేదసాగు, డ్రం సీడర్ ద్వారా సుమారు ఇరవై వేల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. కూలీల ఖర్చు, పెట్టుబడి వ్యయం ఎక్కువై పంటను మాసివ్ హార్వేస్టర్ మిషన్ ద్వారా కోతలు కోయిస్తున్నారు. ఎక్కువమంది రైతులు కూలీల ద్వారా కోతలు కోయించి వరి కుప్పలు వేసి వాటిని నూర్పిడి చేస్తారు. ఏ పద్ధతిలో వరి నూర్పిడి చేసినప్పటికీ... పండిన పంటలో సుమారు 2 శాతానికి పైగా ధాన్యం నేలపాలు అవుతుంది. ఈ వరి గింజలు అందరి పొలాల్లో మినుము లేదా తరువాత వేసే పంటల్లో మొలకెత్తుతాయి.

విత్తనం వేయకుండానే

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం, పెదప్రోలు గ్రామ పరిధిలో ముమ్మనేని వెంకట చలపతి రావు అనే రైతు.. తన 12 ఎకరాల పొలంలో జులైలో దుక్కి దున్ని వదిలి వేశారు. లోతున పడిన వరి గింజలు మెులకెత్తాయి. తమ పొలంలో అందరిలాగే మినుము, వరి మొక్కలు విపరీతంగా పెరిగాయి. కలుపు మందు పిచికారి చేయగా మినుము చనిపోయి వరి ఏపుగా పెరిగింది. అందరితోపాటుగా ఎకరానికి సుమారు 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. పొలంలో ఒక్క వరి గింజ వేయకుండా వరి పండించటం చూసి చుట్టూ పక్కల రైతులు ప్రతి రోజు వందల సంఖ్యలో వచ్చి రైతు పొలాన్ని చూసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కోడూరు మండలంలో లింగారెడ్డి పాలెంలోనూ ఏడు ఎకరాల్లో వరి విత్తనాలు జల్లకుండా ఈ విధానంలో వరి పండించారు.

చాలా అరుదు
మండల వ్యవసాయ అధికారిణి ఎ. శివనగారాణి, సహాయ వ్యవసాయ అధికారిణి యం. కల్పన వరి పంట పొలాన్ని పరిశీలించారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా వరి గింజలు మొలకెత్తుతాయి అని తెలిపారు. వరి కోయగానే దమ్ము చేయడం వలన వరి గింజలు సుమారు ఎనిమిది అంగుళాల లోతు వరకు వెళ్తాయని... దుక్కి దున్నడం వలన మరలా విత్తనాలు పైకి వచ్చి మొలిచి ఉండవచ్చని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి :

మేడమ్... వెళ్లొద్దంటూ విద్యార్థుల కన్నీరు..!

Intro:ap_vja_25_27_jk_varivitanalu_veyakunda_varipanta_pkg_bytes_ap10044

kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజవర్గం
సెల్.9299999511

వరి విత్తనాలు వేయకుండా వరి పంట బైట్స్

జైకిసాన్ కోసం స్టొరీ

Body:వరి విత్తనాలు వేయకుండా వరి పంట బైట్స్

Conclusion:వరి విత్తనాలు వేయకుండా వరి పంట బైట్స్
Last Updated : Nov 28, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.