నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హార్టికల్చర్, అగ్రికల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద స్పందన దీక్షకు దిగారు. వ్యవసాయ ఉద్యాన శాఖలు 2017వ సంవత్సరంలో, ప్రభుత్వం జీవో 43 ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ... మౌఖిక పరీక్ష ద్వారా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతితో రాష్ట్ర వ్యవసాయ ఉద్యానశాఖలో 5వేల 7వందల 64 మంది ఎంపీఈవోలు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు, ఇప్పటికే పనిచేస్తున్న ఎంపీఈవోలను నేరుగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి... "ప్రజలు ఆలోచనలతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి"