రాష్ట్రంలో పని చేస్తున్నతెలంగాణ ఉద్యోగులకు రిలీవ్ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలిపారు. 711 మంది ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు.. సీఎం జగన్‌ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వంలో తమ సర్వీసులను కొనసాగించేందుకుగానూ తమను రిలీవ్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా ముఖ్యమంత్రి స్పందించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. తెలంగాణకు చెందిన క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ ఉద్యోగులను తమ కేడర్లో చేర్చుకునేందుకు ఇప్పటికే తెలంగాణ సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయంలో వెలుపల టపాసులు కాల్చి తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి