తపాలా శాఖ వద్ద నిలిచిపోయిన రూ.24 కోట్లకుపైగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను తిరిగి కూలీలకు చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి చెల్లింపుల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, తపాలాశాఖ ఉన్నతాధికారులతో జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. 2007 నుంచి 2016 మధ్య ఉపాధి పనులకు హాజరైన దాదాపు 8 లక్షల మంది కూలీల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నరేగా ప్రారంభమయ్యాక అనేక ఏళ్లపాటు కూలీలకు తపాలా కార్యాలయాల ద్వారా వేతనాలు చెల్లించేవారు. 2016 తరువాత ‘జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ విధానం’ అమలులోకి వచ్చింది. ఇందుకోసం కూలీలతో జాతీయ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలను తెరిపించి వేతనాలు నేరుగా జమ చేస్తున్నారు. ఈవిధానం అమలులోకి రాక ముందు కొన్ని సాంకేతిక సమస్యలతో తపాలా కార్యాలయాల్లో కూలీలకు సంబంధించిన రూ.24 కోట్లకుపైగా వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి.
ఇవీ చూడండి...: ఉపాధి హామీ బకాయిల చెల్లింపులో జాప్యమెందుకు..? హైకోర్టు