విజయవాడలోని విద్యుత్ సౌధ కార్మిక భవన్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల రిలీవ్ ఎంప్లాయిస్ ఐకాస అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర విభజనలో భాగంగా విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి ఆదేశాలకు వ్యతిరేకంగా తెలంగాణకు కెేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వటాన్ని జేఏసీ నాయకులు తప్పుపట్టారు. ఈనెల 14వ తేదీ సెలవు దినం అయినప్పటికీ యాజమాన్యం ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా రిలీవ్ ఉత్తర్వులు ఇవ్వడంపై జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 655 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థలకు బదిలీ చేయగా తెలంగాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు.
విజయవాడలో విద్యుత్ రిలీవ్ ఎంప్లాయిస్ ఐకాస సమావేశం - విద్యుత్ ఉద్యోగుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల రిలీవ్ ఎంప్లాయిస్ ఐకాస విజయవాడలోని గుణదలలోని విద్యుత్ సౌధ కార్మిక భవన్లో అత్యవసర సమావేశం నిర్వహించింది. జస్టిస్ ధర్మాధికారి ఆదేశాలకు వ్యతిరేకంగా తెలంగాణకు కేటాయిస్తూ అక్రమంగా రిలీవ్ ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలోని విద్యుత్ సౌధ కార్మిక భవన్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల రిలీవ్ ఎంప్లాయిస్ ఐకాస అత్యవసర సమావేశం జరిగింది. రాష్ట్ర విభజనలో భాగంగా విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి ఆదేశాలకు వ్యతిరేకంగా తెలంగాణకు కెేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వటాన్ని జేఏసీ నాయకులు తప్పుపట్టారు. ఈనెల 14వ తేదీ సెలవు దినం అయినప్పటికీ యాజమాన్యం ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా రిలీవ్ ఉత్తర్వులు ఇవ్వడంపై జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 655 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థలకు బదిలీ చేయగా తెలంగాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:దూరం దూరం జరగండి- కరోనాను కట్టడి చేయండి