కొవిడ్ బాధితులకు మేమున్నామంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొచ్చింది. పాజిటివ్ సోకిన వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఉచితంగా అందిస్తోంది. విజయవాడ గాంధీనగర్ సమీపంలోని రెడ్‌క్రాస్ భవనంలో స్టాల్‌ను ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రోగులు కిట్స్‌ను తీసుకెళ్తున్నారు. సరైన మందులు వాడుకుంటే కొవిడ్ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దాతలు ముందుకు వస్తే మరింత మంది బాధితులకు కిట్స్ అందిస్తాన్నామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా ఛైర్మన్ డాక్టర్ సమరం తెలిపారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్' ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.
ఇదీ చదవండి: