ఇటీవల కురిసిన భారీ వర్షానికి కృష్ణా జిల్లా ఘంటశాలలో ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద పెద్ద మొత్తంలో నీరు చేరింది. గత నెల రోజులుగా వర్షపు నీటిలో ఈ స్థూపం నానుతుండటం వల్ల దాని భద్రతకు ముప్పు ఏర్పడింది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని బౌద్ధబిక్షువులు దూరం నుంచే పూజలు నిర్వహించారు. చారిత్రకు బౌద్ధ స్థూపం గత నాలుగు వారాలుగా వర్షం నీటిలో నానుతోన్న విషయాన్ని ఈనాడు 'ఇది బావి కాదు బౌద్ధ స్థూపం' అనే శీర్షికతో వెలుగులోకి తెచ్చింది. కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. బౌద్ధ మహా స్తూపం వద్ద నిలిచిఉన్న వర్షపునీటిని అగ్నిమాపక సిబ్బంది బయటకు పంపించారు.
ఇదీచదవండి