కొవిడ్ టీకా తీసుకోవడానికి సాధారణ ప్రజలు ముందుకొస్తున్నారు. మొదట టీకా వేసుకోవడానికి సంకోచించినా వైద్యశాఖ అధికారుల అవగాహన కార్యక్రమాలు, కేసు ఎక్కువుతున్నందున.. ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొవిడ్ టీకా తీసుకోవడానికి ప్రజలు భారీగా వచ్చారు. పెద్దఎత్తున గుంపులుగా చేరి, టీకాలు కావాలంటూ వైద్యసిబ్బందిని కోరుతున్నారు. కొద్దిమొత్తం వస్తున్న టీకాల కోసం పెద్దఎత్తున వస్తున్న ప్రజలకు ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితిని వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: