దేశంలో సమాచార హక్కు చట్టం అందుబాటులోకి వచ్చాకే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగిందని... ప్రభుత్వ పాలన యంత్రాంగాల్లో జవాబుదారీతనం, పారదర్శకత కనిపిస్తున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదాయపన్నుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాగురుకత అవగాహన వారాన్ని గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన అవినీతి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఆకాంక్షించారు. అవినీతిరహిత భారత్ లక్ష్యసాధన కోసం ప్రజలు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు, పాలన విభాగాలు తమ విధుల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దాలంటే...ప్రభుత్వాలతో సహా ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని గవర్నర్ అభిలాషించారు.
ఇదీ చూడండి: ఈ దీపావళి ప్రజలందరికీ సంతోషాన్ని పంచాలి: గవర్నర్