ETV Bharat / state

విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్‌లో ఉండాల్సిందే..!

విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, విమానాశ్రయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Quarantine Must For Foreign Returnees in ap

author img

By

Published : May 7, 2020, 8:05 PM IST

విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఈ కారణంగా విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులపాటు క్వారంటైన్​లో ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

వచ్చే 3 రోజుల్లో విదేశాల నుంచి సుమారు 30 వేల మంది ప్రయాణికులు రాష్ట్రానికి రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయాణికులు విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలకు చేరుకోనున్నారు. అధికారులు ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌, గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూధనరావు, సంయుక్త కలెక్టర్ డాక్టరు కె.మాధవీలత, హోటల్‌ అసోయేషన్‌ ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రానికి రానున్న విదేశీ ప్రయాణికుల్లో సుమారు 15 వేల నుంచి 20 వేల మంది గన్నవరం విమానాశ్రయానికి రావొచ్చని అంచనా వేస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. గన్నవరం చేరుకునే వారిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల ప్రయాణికులు ఉంటారని.. వీరికి నియమాల ప్రకారం.. థర్మల్‌ స్కానింగ్‌తోపాటు కోవిడ్‌-19 స్క్రీనింగ్‌ చేయాలని చెప్పారు. థర్మల్‌ స్క్రీనింగ్‌లో పాజిటివ్‌ వస్తే కోవిడ్‌ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

ఎయిర్్​పోర్టు బయట 4 జిల్లాల ప్రయాణికుల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయాణికులను ఆయా జిల్లాల క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. తొలిరోజు, ఐదో రోజు, 15వ రోజు నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తారని.. నెగెటివ్‌ వస్తే వారిని ఇళ్లకు పంపించి హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తామని కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. ఏ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినా అతన్ని వెంటనే కోవిడ్‌-19 ఆసుపత్రికి తరలిస్తామన్నారు.

విదేశాల నుంచి వచ్చే వారు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే.. రోజుకు మూడు వేలు, నాలుగు వేల రూపాయల సొంత ఖర్చులతో స్థానిక హోటళ్లలో గదులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ మొత్తానికి అల్పాహారంతోపాటు రెండు పూటల భోజనం అందించేందుకు హోటళ్లు సహకరించాలని కోరారు. ప్రతి హోటల్‌లో కనీసం వంద గదులు ఉండేలా చూడాలని కోరారు. అక్కడ పోలీసు భద్రత, వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేసి పరిశుభ్రం చేసినట్లు గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టరు మధుసూధనరావు తెలిపారు.

ఇవీ చదవండి: 'అండగా ఉంటాం... ఆదుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.