కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ ఎం.సురేశ్ బాబుతోపాటు డిప్యూటీ వార్డెన్ సాగర్ బాబును సస్పెండ్ చేసినట్లు ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ కె. అనంతయ్య వెల్లడించారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి కె. రాములు.. శుక్రవారం పులిగడ్డ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈనెల 16న పాఠశాలను ప్రారంభమైనప్పటికీ.. ఒక్క విద్యార్థి కుడా తరగతులకు హాజరు కాలేదు.
ఇప్పటి వరకు 5వ తరగతి ప్రవేశాలల్లో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, అలాగే స్టాక్ రికార్డులు సైతం సరిగా లేవని.. 1209 కేజీల బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటిపై కార్యదర్శి రాములు ఆగ్రహం వ్యక్తంచేశారు. విధి నిర్వాహణలో అలసత్వం వహించిన ప్రిన్సిపల్, డిప్యూటీ వార్డెన్ సాగర్ బాబుపై చర్యలకు ఆదేశించారు. ఈరోజు ఇంఛార్జీ ప్రిన్సిపల్‌గా బాధ్యతులు చేపట్టిన సీనియర్ ఉపాధ్యాయుడు కె. అనంతయ్య.. ఆధికారుల ఆదేశాల మేరకు సదరరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: